అక్కడి నుంచి వచ్చే సమాధానం కోసం చూస్తున్నాం : భారత్ బయోటెక్

అత్యవసర అనుమతి పొందడానికి కొవాగ్జిన్‌కు సంబంధించిన అన్ని వివరాలు, డేటాను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)కు సమర్పించామని, ప్రస్తుతం అక్కడి నుంచి వచ్చే సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని భారత్ బయోటెక్ వెల్లడిరచింది. జులై ప్రారంభంలో ఎమర్జెన్సీ యజ్ లిస్టింగ్ (ఈయూఎల్)కు దరఖాస్తు చేశాం. డబ్ల్యూహెచ్‌ఓ అడిగిన అన్ని సందేహాలకు సమాధానం ఇచ్చాం. నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని భారత్ బయోటెక్ పేర్కొంది. వీలైనంత త్వరలో డబ్ల్యూహెచ్‌ఓ అమోదం లభించగలదని భావిస్తున్నట్లు తెలిపింది.