కేంద్రానికి షాక్… మమత కీలక నిర్ణయం

పశ్చిమ బెంగాల్ సీఎస్ ఆలాపన్ బంధోపాధ్యాయను కేంద్ర సర్వీసులకు పంపాలని ఆదేశించిన కేంద్రానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ షాక్ ఇచ్చారు. ఆలాపన్ బందోపాధ్యాయును బెంగాల్ సీఎస్ పదవికి రాజీనామా చేయించి ముఖ్య సలహాదారుగా నియమించుకున్నారు. ఆలాపన్ బందోపాధ్యాయ బెంగాల్ సీఎస్ పదవికి రాజీనామా చేశారు. ఫలితంగా సీఎం మమత బెనర్జీకి ముఖ్య సలహాదారుగా చేరిపోయారు. నెలకు రూ.2.5 లక్షల వేతనంతో ఆలాపన్ బందోపాధ్యాయను మమత తన ముఖ్య సలహాదారుగా నియమించుకున్నారు. ఆయన మూడేళ్లపాటు ఆమె వద్ద పనిచేయనున్నారు.
యాస్ తుఫానుపై మోదీ జరిపిన సమీక్షా సమావేశానికి మమతా బెనర్జీ హాజరు కాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం.. ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఆలాపన్ బంధోపాధ్యాయను ఢిల్లీలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆయన ఢిల్లీలో రిపోర్ట్ చేయాల్సి ఉన్నది. అయితే ఆలాపన్ బంధోపాధ్యాయ మే 31న పదవీ విరమణ చేస్తున్నారని మమత బెనర్జీ మీడియాకు చెప్పారు. చెప్పిన కొద్ది సేపటికే ఆయనను ప్రభుత్వ సలహాదారుగా నియమించి కేంద్రానికి ఘాటుగా జవాబిచ్చింది.