ఆస్ట్రియా లో మళ్లీ లాక్‌డౌన్

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఆస్ట్రియాలో దేశవ్యాప్త లాక్‌డౌన్ విధించారు. గత కొద్ది వారాలుగా రోజువారీ కరోనా కేసులు మూడిరతలు పెరగడం, తమ ఐసీయూ పడకలన్నీ కోవిడ్ రోగులతో నిండిపోయాయని చాలా ఆస్పత్రులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆస్త్రియా అప్రమత్తమైంది. లాక్‌డౌన్ 10 రోజుల పాటు కొనసాగుతుందని, అయినా పరిస్థితి అదుపులోకి రాకపోతే మరో 10 రోజులు పొడిగిస్తామని గతంలో ప్రకటించింది.