కోవిషీల్డ్ కు ఆస్ట్రేలియా ఆమోదం

కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను ఆస్ట్రేలియా ఆమోదించింది. దీంతో ఆ దేశానికి వేలాది మంది భారత విద్యార్థులు తిరిగి వెళ్లడానికి వీలవుతుందని భావిస్తున్నారు. కోవిషీల్డ్, కరోనావాక్ (సినోవాక్) వ్యాక్సిన్లు వేయించుకుని తమ దేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులను వ్యాక్సినేటెడ్‌గా గుర్తించాలని నిర్ణయించినట్లు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ కార్యాలయం తెలిపింది. తమ వైద్య నియంత్రణా సంస్థ థెరప్యూటిక్ గూడ్స్ అడ్మినిస్ట్రేషన్ (టిజిఏ) ఈ మేరకు సిఫార్సు చేసిందని పేర్కొంది. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ ప్రయాణాలు ఏ రీతిన వుంటాయో తెలియచేస్తూ నిబంధనావళి రూపొందించనున్నట్లు తెలిపింది.