ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన దక్షిణాఫ్రికా : అమెరికా

దక్షిణాఫ్రికాపై అగ్రరాజ్యం అమెరికా ప్రశంసలు కురిపించింది. ఇటీవల దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగుచూసిన విషయం తెలిసిందే. కాగా ఆ దేశం కొత్త వేరియంట్‌ను గుర్తించి వెంటనే ప్రపంచ దేశాలకు సమాచారం ఇవ్వడం గొప్ప విషయమని సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ అన్నారు. ఆయన దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి నలెడి పాండొర్‌తో సమావేశమయ్యారు. దక్షిణాఫ్రికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఇరువురు చర్చించారు. ఈ సందర్భంగా కొత్త వేరియంట్‌ను త్వరితగతిన గుర్తించిన శాస్త్రవేత్తలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమాచారాన్ని పంచుకోవడంతో పారదర్శకత ప్రదర్శించిన దక్షిణాఫ్రికా ప్రభుత్వం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు.