కొవాగ్జిన్ తీసుకున్నవారికి అమెరికా… గ్రీన్ సిగ్నల్

దేశీయ పార్మా దిగ్గజం భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన కొవాగ్జిన్ టీకా తీసుకున్న భారతీయ విద్యార్థులు తమ దేశం వచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కొవాగ్జిన్ టీకా వేసుకున్న భారతీయ విద్యార్థులపై ఆంక్షలను ఎత్తివేసినట్లు అమెరికా ప్రకటించింది. ఈ నిర్ణయంతో భారతీయ విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా, డబ్ల్యూహెచ్‍ఓ అనుమతి లేకపోవడంతో పలు దేశలు కొవాగ్జిన్‍పై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అమెరికాలో ప్రస్తుతం ఫైజర్, మోడెర్నా రెండు టీకాలను వినియోగిస్తున్నారు.