కరోనాతో పిజ్జాహట్ కో ఫౌండర్ ఫ్రాక్ కార్నే మృతి

కోవిడ్-19 బారిన పడి కోలుకున్న ప్రముఖ వ్యాపారవేత్త, పిజ్జా హట్ సహ వ్యవస్థాపకుడు ఫ్రాంక్ కార్నే(82) న్యుమోనియాతో మరణించారు. గత దశాబ్దకాలంగా అల్జీమర్స్ తో బాధపడుతున్న కార్నీ ఇటీవల కరోనా నుంచి కోలుకున్నారు. కానీ ఆ తరువాత న్యుమోనియా వ్యాధి సోకింది. దీంతో పరిస్థితి విషమించడంతో బుధవారం కన్నుమూశారని అతని భార్య, సోదరుడు ప్రకటించారు. 1958లో సోదరుడు డాన్ (26) తో కలిసి అమెరికా, కాన్సాస్ రాష్ట్రంలోని విచితాలో 19 ఏళ్ల వయసులో పిజ్జా హట్ సామ్రాజ్యాన్ని ప్రారంభించారు ఫ్రాంక్ కార్నె. వారి తల్లిదండ్రులనుంచి అప్పుగాతీసుకున్న 600 డాలర్లతో ప్రారంహించిన సంస్థ అంచలంచెలుగా వ•ద్ధిని సాధించి దిగ్గజ సంస్థగా అవతరించింది.