829 మంది టీచర్లకు..575 మంది విద్యార్థులకు కరోనా!
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 2 నుంచి పాఠశాలలు ప్రారంభం కావడంతో కరోనా బుసలు కొడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటివరకు 829 మంది ఉపాధ్యాయులు, 575 మంది విద్యార్థులు కరోనా బారిన పడినట్టు పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని మొత్తంగా 41,623 ప్రభుత్వ పాఠశాలల్లో 70,790 మంది ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు చేయగా 829 మందికి పాజిటివ్‌గా తేలింది. అలాగే 95,763 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా 575 మందిలో వైరస్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఉపాధ్యాయుల్లో పాజిటివిటీ రేటు 1.17 శాతం ఉండగా, విద్యార్థుల్లో ఈ రేటు 0.60 శాతంగా ఉన్నట్టు అధికారులు విడుదల చేసిన గణాంకాలు సూచిస్తున్నాయి.






