సీబీఐ కార్యాలయంలో కరోనా కలకలం.. ఒకేసారి 68 మంది

ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) కార్యాలయంలో పనిచేస్తున్న 68 మంది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఉద్యోగులకు కరోనా సోకిందని దర్యాప్తు సంస్థ అధికారులు తెలిపారు. కార్యాలయంలో పని చేస్తున్న 235 మందికి పరీక్షలు నిర్వహించాలని సీబీఐ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌ను కోరింది. ఈ మేరకు సిబ్బంది, అధికారులకు పరీక్షలు నిర్వహించగా ఇందులో 68 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. వైరస్ పాజిటివ్‌గా తేలిన ఉద్యోగులు హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు.