అమెరికా లో వరుసగా మూడోరోజు రికార్డు స్థాయిలో కరోనా వైరస్ కేసులు

అమెరికా లో ఆకస్మాత్తుగా కరోనా వైరస్ విజృంభించడం ప్రారంభించింది. గత నెల వరకు నియంత్రణ లో ఉన్నట్టు కనిపించిన కరోనా వైరస్ గత రెండు వారాల నుంచి మరింత పెరుగుతూనే ఉంది. వరుసగా మూడవ రోజు అమెరికా 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొరోనావైరస్ కేసులను నమోదు చేసింది. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం యొక్క లెక్కలు ప్రకారం ప్రపంచంలోనే కరోనా వైరస్ అత్యంత ప్రభావం చూపిన దేశం గా అమెరికా మొదటి స్థానంలో నిలిచింది. 5th డిసెంబర్ 2020 శనివారం మాత్రమే దాదాపు 230,000 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదు కాగా 2,527 కోవిడ్ సంబంధిత మరణాలు చోటు చేసుకున్నట్లు జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం ప్రకటించింది. రెండు వారాలపాటు క్రమం తప్పకుండా రోజుకు 2,000 కరోనా వైరస్ మరణాలలో అమెరికా అగ్రస్థానంలో ఉంది.
అమెరికా ఆరోగ్య అధికారులు గత వారం థాంక్స్ గివింగ్ సెలవుదినాన్ని జరుపుకోవడానికి ఇంట్లోనే ఉండాలని విజ్ఞప్తి చేసినప్పటికీ మిలియన్ల మంది అమెరికన్లు ప్రయాణించడమే ఈ పెరుగుదలకు కారణం అని తెలిపారు. గత సంవత్సరం చైనాలో ఉద్భవించినప్పటి నుండి కరోనావైరస్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 1.5 మిలియన్లకు పైగా ప్రజల ప్రాణాలు తీసుకుంది అని మరియు 66 మిలియన్ల మందికి సోకింది అని అధికారులు తెలిపారు.
అయితే కరోనావైరస్ సంక్షోభానికి వ్యాక్సిన్లు మ్యాజిక్ బుల్లెట్ కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఎందుకంటే రష్యా తన అధిక-ప్రమాద కార్మికులకు టీకాలు వేయడం ప్రారంభించింది మరియు ఇతర దేశాలు ఇలాంటి కార్యక్రమాలకు సిద్ధమయ్యాయి.
ప్రస్తుతం 51 సంస్ధల కరోనా వైరస్ వ్యాక్సిన్లు మానవులపై పరీక్షించబడుతున్నాయని వాటిలో 13 సంస్ధల కరోనా వైరస్ వ్యాక్సిన్ లు చివరి దశ సామూహిక పరీక్షకు చేరుకున్నాయి డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.
ఈ నెల చివర్లో అమెరికా వైరస్ వ్యాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.