తెలంగాణలో ప్రారంభమైన కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్

తెలంగాణ వ్యాప్తంగా తొలి డోస్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఈ రోజు రెండో డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సందర్భంగా సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో డీఎంఈ రమేశ్‌రెడ్డి రెండో డోస్ తీసు తీసుకున్నారు. టిమ్స్ డైరెక్టర్ విమలా థామస్ కూడా రెండో డోస్ కొవిడ్ టీకా వేయించుకున్నారు. మొత్తం 140 కేంద్రాల్లో కొవిడ్ టీకాలు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. మొదటి డోస్ తీసుకున్న చోటే రెండో డోస్ వేసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. మొదట ఏ కంపెనీ డోస్ తీసుకుంటే మళ్లీ అదే తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. మొదటి డోస్ తీసుకోని సిబ్బంది ఈ నెల 25 లోగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ నెల 25 తర్వాత మొదటి డోస్ ఇచ్చే అవకాశం లేదని వైద్యరోగ్యశాఖ సృష్టం చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులతో కలిపి సుమారు మూడు లక్షల మందికి పైగా సిబ్బంది వ్యాక్సినేషన్ కోసం కొవిన్ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేసుకున్నారు. అయితే 58.3 శాతం మంది మాత్రమే తొలి డోస్ వ్యాక్సిన్ తీసుకున్న విషయం తెలిసిందే.