ఆ రెండు నెలలే అత్యంత కీలకం : కేంద్రం
దేశంలో ప్రస్తుతం కరోనా రెండో దశ కొనసాగుతోందని కేంద్రం హెచ్చరించింది. సెప్టెంబర్, అక్టోబర్ల్లో అనేక పండుగలు ఉండటంతో కరోనా నియంత్రణలో ఆ రెండు నెలలే అత్యంత కీలకమని తెలిపింది. ప్రజలంతా తగిన జాగ్రత్తలతో ఉండాలని హెచ్చరించింది. ప్రస్తుతం దేశం కరోనా రెండో దశల మధ్యలో ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. కొవిడ్ పరిస్థితులపై కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు మీడియాతో మాట్లాడారు. వ్యాక్సిన్లు వ్యాధి నుంచి రక్షణ మాత్రమే కల్పిస్తాయని, అందువల్ల వ్యాక్సినేషన్ తర్వాత ప్రతిఒక్కరూ మాస్క్లు తప్పనిసరిగా వాడాలని విజ్ఞప్తి చేశారు.







