భారత్‌లో ఒమిక్రాన్ కలకలం

ఒమిక్రాన్ వేరియంట్ భారత్‌లో ప్రవేశించింది. తాజాగా భారత్‌లో రెండు కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. విదేశాల నుంచి వచ్చిన వారిలో కొత్తవైరస్ నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. వైరస్ సోకిన ఇద్దరు పురుషుల్లో ఒకరికి 46, మరోకరికి 66 ఏళ్లని కేంద్రం తెలిపింది. వైరస్ సోకిన ఇద్దరిని ప్రత్యేకంగా ఐసోలేషన్‌లో తరలించినట్లు కేంద్రం తెలిపింది. కాగా, ఒమిక్రాన్ సోకినవారి ప్రైమరీ కాంటాక్ట్స్ ట్రేస్ చేస్తున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. అయితే వీరిద్దరిలో తీవ్రమైన లక్షణాలు లేవని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.