భారత్ లో అందుబాటులోకి మరో వ్యాక్సిన్ …

రష్యా అభివృద్ధి చేసిన కరోనా టీకా స్పత్నిక్-వి డోసులు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‍కు చేరుకున్నాయి. టీకాల కొరత వేధిస్తున్న తరుణంలో మాస్కో నుంచి లక్షా 50 వేల స్పత్నిక్-వి టీకాలు భారత్ చేరుకోవడం ఊరట కలిగించే అంశం. ఇక ఈ నెలలోనే భారత్‍లో ఈ టీకా ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు సమాచారం. దేశీయంగా స్పుత్నిక్-వి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ను ప్రముఖ ఔషధ తయారీ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ చేపట్టిన విషయం తెలిసిందే. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ (ఆర్‍డీఐఎఫ్) సహకారంతో గమలేయా ఇన్‍స్టిట్యూట్ తయారు చేసిన స్పుత్నిక్ టీకాను భారత్‍లో ఉత్పత్తి, పంపిణీకి గతేడాది సెప్టెంబర్‍లోనే డాక్టర్ రెడ్డీస్‍తో ఒప్పందం కుదిరింది. ఈ వ్యాక్సిన్లను డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్‍కు డెలివర్ చేయనున్నారు. గత నెల 13న స్పుత్నిక్ వి వ్యాక్సిన్‍కు డీసీజీఐ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.