దేశంలో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు…

దేశంలో కొత్తగా భయాందోళనలకు కారణమైన బ్లాక్ ఫంగస్ తాజా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ మంత్రుల బృందం (జీఓఎం) 27వ సమావేశం నిర్వహించారు. దేశంలో బ్లాక్ ఫంగస్ (మ్యూకోర్‍మైకోసిస్) వ్యాప్తిపై ఈ భేటీలో చర్చ జరిగింది. దేశంలో ఇప్పటి వరకు 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 5,424 బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయని మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ మంత్రుల బృందానికి నివేదించారు. గుజరాత్‍లో 2,165, మహారాష్ట్రలో 1,188, ఉత్తరప్రదేశ్‍లో 663, మధ్యప్రదేశ్‍లో 519, హరియాణాలో 339, ఆంధప్రదేశ్‍లో 248 కేసులు నమోదయ్యాయి. మొత్తం 5,424 కేసులలో 4,556 మంది రోగులకు కోవిడ్-19 ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ రోగులలో మొత్తం 55 శాతం మందికి డయాబెటిస్ ఉన్నట్లు గుర్తించామన్నారు.