ఒమిక్రాన్ విజృంభణతో.. 11,500 విమానాలు రద్దు

ప్రతి ఏడాది క్రిస్మస్ సమయంలో విమానాశ్రయాలు అత్యంత రద్దీగా ఉంటాయి. అయితే అమెరికా, బ్రిటన్ దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభణతో ఈ ఏడాది పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. అలాగే మరోవైపు సిబ్బంది కొరత వేధిస్తోంది. ఒమిక్రాన్ నేపథ్యంలో సిబ్బంది విధులకు హాజరుకావడం లేదని ప్రముఖ విమానయాన సంస్థలు తెలిపాయి. గత వారం నుండి ప్రపంచవ్యాప్తంగా సుమారు 11,500 విమానాలు రద్దయ్యాయి. మరో పదివేల విమానాలు రద్దు కానున్నాయని సంస్థలు వెల్లడించాయి. సోమవారం ఒక్కరోజే మూడు వేల విమానాలు రద్దు కాగా, మంగళశారం నాటికి ఆ సంఖ్య 1100కి చేరిందని తెలిపాయి. కరోనా నేపథ్యంలో కొన్ని దేశాలు మాత్రమే ప్రయాణికులను అనుమతిస్తున్నాయి.