టీకా పంపిణీలో కీలక మైలురాయిని అధిగమించిన అగ్రరాజ్యం

టీకా పంపిణీలో అమెరికా కీలక మైలురాయిని దాటింది. అగ్రరాజ్యంలో ఇప్పటివరకు 10 కోట్ల మంది కరోనా టీకా రెండు డోసులూ అందుకున్నారు. ఈ విషయాన్ని శ్వేతసౌధం వెల్లడించింది. 18 ఏళ్ల దాటిన వారిలో ఇప్పటి వరకు 39 శాతం మంది రెండు డోసులూ తీసుకున్నారని, తొలి డోసు తీసుకున్న వారిలో 8 శాతం మంది రెండో డోసు తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. టీకా పంపిణీ పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో పర్యాటక ప్రదేశాలకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను అనుమతించాయి. వ్యాక్సిన్ పంపిణీని మరింత విస్తృతం చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.