ఆయనకు కరోనా వైద్య పరీక్షలు అవసరం లేదు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని, ఆయనకు కరోనా వైద్య పరీక్షలు అవసరం లేదని వైట్‌హౌస్ ప్రకటించింది. గత నెలాఖరులో వాషింగ్టన్లో ట్రంప్ హాజరైన రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులకు కరోనా నిర్ధారణ అయింది. ఈ ఇద్దరిని కలిసిన రిపబ్లికన్లు డౌగ్ కొలిన్స్, మ్యాట్ గేట్జ్ స్వీయ నిర్బంధానికి వెళ్తున్నట్లు తాజాగా ప్రకటించారు. కొలిన్స్ గత వారం సెంటర్స్ ఫర్ డిసీస్ కంట్రోల్‌ను సందర్శించిన ట్రంప్‌తో కరచాలనం చేశారు. గేట్జ్ ట్రంప్‌తో కలిసి పర్యటించారు. కాగా కొలిన్స్, గేట్జ్లకు వైరస్ నిర్దారణ కాలేదు.













