మోదీ ఇంగ్లిష్‌లో బాగా మాట్లాడతారు కానీ… ట్రంప్
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడతారనీ, కానీ, ఇంగ్లిష్‌లో మాట్లాడేందుకు ఇష్టపడరని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరదాగా వ్యాఖ్యానించారు. జీ-7 భేటీ సందర్భంగా ఇరువురు నేతలు మీడియా ముందుకు వచ్చి, కరచాలనం అనంతరం కలిసి మాట్లాడారు. నేతలకు ప్రైవేట్‌గా మాట్లాడుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా విలేకరులను కోరిన మోదీ వారు అడిగిన పలు ప్రశ్నలకు హిందీలో సమాధానాలు ఇచ్చారు. ఆయన (మోదీ) వాస్తవానికి చాలా బాగా ఇంగ్లిష్ మాట్లాడగలరు. కానీ ఆయనకు ఇంగ్లిష్ మాట్లాడటం ఇష్టం ఉండదు. మోదీతో సమావేశం గొప్ప విషయం. భారత్, గురించి చాలా విషయాలు తెలిశాయి అని ఈ సందర్భంగా ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్, మోదీ ఒకరి చేతులు మరొకరు చేతులు పట్టుకుని ఉండగా సమావేశం జరుగుతున్న గదిలో ఉన్న నేతలంతా పెద్ద పెట్టున నవ్వారు. స్నేహితుడు ట్రంప్‌తో జరిపిన సమావేశం చాలా ముఖ్యమైందని మోదీ పేర్కొనడం గమనార్హం.













