యూరప్ ట్రావెలర్స్ కోసం విజిటర్స్ కవరేజీ ప్రత్యేక పథకం
ఇన్స్యూరెన్స్ రంగంలో ప్రత్యేకమైన పాలసీలతో కస్టమర్లను ఆకట్టుకుంటున్న విజిటర్స్ కవరేజ్ ఇప్పుడు యూరప్ పర్యటనకు వెళుతున్న పర్యాటకుల కోసం ప్రత్యేక పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. యూరప్ ట్రావెల్ – ప్లస్ పేరుతో ఉన్న ఈ స్కీమ్‌ను షెంగెన్ వీసా నిబంధనలకు అనుగుణంగా రూపొందించారు. ఈ స్కీమ్‌లో ఉన్న అదనపు ప్రయోజనం ఏమిటంటే మెడికల్ కవరేజీతోపాటు ట్రావెల్ ఎమర్జెన్సీ ప్రయోజనాలు కూడా ఒకే ప్లాన్‌లో లభిస్తాయి. ఈ ప్లాన్‌తో పర్యాటకులు యూరప్ పర్యటనను హాయిగా, ఉల్లాసంగా భయం లేకుండా చేయవచ్చని విజిటర్స్ కవరేజ్ అంటోంది. గ్లోబల్ బెనెఫిట్స్ అండ్ అసిస్టెన్స్ సర్వీసెస్ లీడర్‌గా ఉన్న ఇంటర్నేషనల్ మెడికల్ గ్రూపు (ఐఎంజి)తో కలిసి ఈ యూరప్ ట్రావెల్ ప్లస్‌ను విజిటర్స్ కవరేజ్ ప్రవేశపెట్టింది.
రోజురోజుకు పెరుగుతున్న యూరప్ పర్యాటకుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని తాము ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు కంపెనీ సిఇఓ రాజీవ్ శ్రీవాస్తవ చెప్పారు. కస్టమర్ల అభిప్రాయలకు తగ్గట్టుగా తమ ట్రావెల్ ఇన్స్యూరెన్స్ ఉంటాయని, ఈ స్కీమ్ కూడా అలాంటిదేనని ఆయన వివరించారు. ఒక్క ఇన్స్యూరెన్స్‌తో పలు ప్రయోజనాలు ఉండేలా తాము చూస్తామని, ఈ ఇన్స్యూరెన్స్‌తో యూరప్ వెళ్ళే పర్యాటకులు హాయిగా, క్షేమంగా వెళ్ళిరావచ్చని చెప్పారు.
ఇతర వివరాలకు విజిటర్స్ కవరేజ్ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
https://www.visitorscoverage.com/europetravel-plus-insurance/













