ట్రంప్ జూనియర్ దంపతులు విడిపోనున్నారు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ట్రంప్ జూనియర్, అతని బార్య వనెసా ట్రంప్ దంపతులు విడాకులు తీసుకున్నారు. ఇద్దరూ వేరుకానున్నట్లు సంయుక్త ప్రకటనలో తెలియజేశారు. పెళ్లి అయిన 12 ఏళ్ల తర్వాత తాము విడిపోయేందుకు నిర్ణయించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. తమ తమ కుటుంబాల పట్ల గౌరవం ఉందని, తమకు అయిదుగురు పిల్లలు ఉన్నారని, వాళ్లే తమ ప్రియార్టీ అని, ఈ సమయంలో ప్రైవసీని ఆశిస్తున్నట్లు జూనియర్ ట్రంప్ దంపతులు ఇద్దరు ప్రకటనలో తెలిపారు. మన్‌హటన్‌లోని సుప్రీంకోర్టులో డోనాల్డ్ ట్రంప్ కోడలు డైవర్స్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు రెండు రోజుల క్రితం మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై వివరణ ఇచ్చేందుకు వైట్‌హౌజ్ తిరస్కరించింది. 2003లో ట్రంప్ జూనియర్ తన భార్య వనెసాను ఫ్యాషన్ షోలో కలుసుకున్నారు. డొనాల్డ్ ఆ ఇద్దర్నీ ఇంట్రడ్యూస్చేశారు. 2005లో వాళ్లు పెళ్లి చేసుకున్నారు.













