ప్రారంభమైన హెచ్ 1 బీ ప్రీమియం ప్రాసెసింగ్
పలుమార్లు వాయిదా పడుతున్న హెచ్ 1బీ వీసా దరఖాస్తుల ప్రీమియం ప్రాసెసింగ్ ప్రక్రియ తిరిగి ప్రారంభమైంది. త్వరితగతిన అంటే దరఖాస్తు చేసిన 15 రోజుల్లో ఆర్జీని పరిశీలనలోకి తీసుకుంటారు. అంతమాత్రాన వీసా మంజూరు చేస్తారన్న గ్యారెంటీ లేదు. అయితే వర్కింగ్ వీసా దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగిపోవడంతో, వాటిని పరిష్కరించేందుకుగాను హెచ్1బీ దరఖాస్తుల ప్రీమియం ప్రాసెసింగ్‌ను యునైటెడ్ స్టేట్స్ సిటిజన్, ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) తాత్కాలికంగా వాయిదా వేసింది. అయితే 2019 సంవత్సరానికి ఈ ప్రక్రియను ఈ నెల 28 నుంచి ప్రారంభించినట్లు యూఎస్సీఐఎస్ ఒక ప్రకటనలో తెలిపింది.













