గ్రీన్ కార్డు కొత్త రూల్
అమెరికాలో పుడ్ స్టాంప్స్ తదితర ప్రభుత్వ ప్రయోజనాలు పొందే చట్టబద్ధ వలసదారులకు గ్రీన్ కార్డ్ నిరాకరించేందుకు ఉద్దేశించిన నిబంధన సోమవారం (24వ తేదీ) నుంచి అమల్లోకి రానుంది. ఈ నిబంధన హెచ్1 బీ వీసా పై అమెరికాలో ఉంటూ, గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్న వేలాది భారతీయులపై ప్రతికూల ప్రభావం చూపనుంది. ఈ నిబంధనపై ఇచ్చిన స్టే ఆర్డర్‌ను సుప్రీంకోర్టు ఎత్తివేసింది. దీంతో అమెరికా సమాజంలోకి కొత్తగా వచ్చే వారు స్వయం సమృద్ధులై ఉండాలని, పన్ను చెల్లింపుదారులైన అమెరికన్లపై వారు ఆధారపడకూడదనే సూత్రం అమల్లోకి వస్తుందని అని అమెరికా తెలిపింది.













