భారత్కు ట్రంప్ బాసట
అగ్రరాజ్యం అమెరికా-భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అవ్వనున్నాయి. ఇటీవల కాలంలో ఇరు దేశాలు ఎన్నో అంశాలపై కలసి పనిచేస్తున్న విషయం తెలిసిందే. రక్షణ రంగంలో చాలా ఒప్పందాలు చేసుకున్న రెండు దేశాలు, తాజాగా మరో ఒప్పందానికి నడుం బిగించాయి. భారత్కు ఎఫ్-16, ఎఫ్-18 ఫైటర్ యుద్ధ విమానాలను అమ్మెందుకు ట్రంప్ పరిపాలనా వర్గం సుమఖం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని యూఎస్ కాంగ్రెస్లో ఈ మేరకు ప్రకటన చేసింది. ఈ సందర్భంగా భారత్, అమెరికాకు ఎంతో ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామి అని పేర్కొంది. ఈ విషయాన్ని ట్రంప్ పరిపాలనా వర్గంలోని ఆలీస్ వెల్స్ వెల్లడించారు. ఇరు దేశాల దౌత్య సంబంధాలలో ఇదొక మైలురాయిగా వెల్స్ అభివర్ణించారు.













