భారతీయులకు ట్రంప్ షాక్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయులకు మరో షాక్ ఇచ్చారు. హెచ్1బీ వీసాల జారీలో ఆంక్షలు, పరిమితులు విధించాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. డేటా లో కలైజేషన్ విషయంలో అమెరికాపై భారత్ తెస్తున్న ఒత్తిడికి ప్రతిఫలంగా వీసాలను తగ్గించేందుకు ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అమెరికా వస్తువులపై భారత్ సుంకాలు పెంచడం వంటి పరిణామాల నేపథ్యంలో మన దేశం నుంచి అమెరికాకు వెళ్తున్న వారిపై ఆంక్షలు విధించాలని ట్రంప్ ప్రభుత్వం యోచిస్తోంది. సుంకాల పెంపునకు ప్రతీకారంగా ట్రంప్ హెచ్1బీ వీసాలపై పరిమితులు విధిస్తోంది. ప్రతి ఏడాది అమెరికా జారీ చేసే హెచ్ 1బీ వీసాల కోటాలో 10 నుంచి 15 శాతం కోత విధించేందుకు కసరత్తు చేస్తోంది.













