చైనా కంపెనీలపై అమెరికా నిషేధం!
చైనాకు చెందిన కొన్ని కంపెనీల పట్ల జాగ్రత్తగా ఉండాలని అమెరికా హెచ్చరించింది. చైనాకు చెందిన హువావే టెక్నాలజీస్‌తో సహా పలు సంస్థలన్నీ చైనా ప్రభుత్వం, మిలిటరీ ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయని అమెరికా వైట్‌హౌస్ ప్రకటించింది. హువావే టెక్నాలజీస్‌తో సహా 20 చైనా కంపెనీల జాబితాను అమెరికా గుర్తించి సిద్ధం చేసింది. ఈ జాబితాలో కంపెనీలను అమెరికాలో నిషేధించవచ్చు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా సంస్థలకు అమెరికాలో పెట్టుబడులు రాకుండా నిరోధించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నిషేధించే కంపెనీల జాబితాలో ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనా, చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్పొరేషన్, చైనా ఏరోస్పేస్, సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్, చైనా ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ గ్రూప్ కార్పొరేషన్, చైనా సౌత్ ఇండస్ట్రీస్ గ్రూప్ కార్పొరేషన్, చైనా షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ కార్పొరేషన్, చైనా స్టేట్ షిప్ బిల్డింగ్ కార్పొరేషన్, చైనా నార్త్ ఇండస్ట్రీస్ గ్రూప్ కార్పొరేషన్, హాంగ్జౌ హివిజన్ డిజిటల్ టెక్నాలజీ కార్పొరేషన్, హువావే, ఇన్స్ప గ్రూప్ వంటి సంస్థలు ఉన్నాయి.













