అది నాగరిక ప్రవర్తనకు విరుద్ధం… పెలోసి
వలస వాసులను తిప్పి పంపుతామంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరించడం నాగరిక చర్య కాదని అమెరికా పార్లమెంట్ స్పీకర్ పెలోసి అన్నారు. వలసవాసులను తిప్పి పంపుతామని ట్రంప్ బెదిరించడాన్ని నాగరిక ప్రవర్తనకు విరుద్ధమని ఆమె వ్యాఖ్యానించారు. శరణార్థులకు సంబంధించి సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్కు రెండు వారాలు గడువు ఇస్తున్నట్లు ట్రంప్ ట్వీట్ చేసిన తరువాత పెలోసి, డి కాలిఫ్ మాట్లాడారు. దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు అమెరికాలో నివసించేందుకు కుటుంబాలతో సహా తరలి వస్తున్నారని అంతకుముందు ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. న్యూయార్క్లో జరిగిన ఇక ఇమ్మిగ్రేషన్ కార్యక్రమంలో అడిగిన ప్రశ్నకు పెలోసి సమాధానిమిస్తూ బెదిరింపు దాడులు భయంకరమైనవని వ్యాఖ్యానించారు.













