గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న వారికి.. తీపి కబురు
అమెరికాలో గ్రీన్‌కార్డుల కోసం ఏండ్లుగా ఎదురుచూస్తున్న వారికి అక్కడి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. నిరుపయోగంగా ఉన్న గ్రీన్‌కార్డులను వెనక్కి తీసుకుని ఆశావహులకు వాటిని అందించాలని అమెరికా నిర్ణయించింది. 1992-2022 మధ్య ఉపాధి, కుటుంబ సభ్యుల కోటాలో జారీ చేసిన 2,30,000 గ్రీన్‌కార్డులను వెనక్కి తీసుకోవాలనే ప్రతిపాదనలకు అమెరికా అధ్యక్షుడి సలహా ప్యానెల్ తాజాగా ఆమోదించింది. ఏటా జారీ చేసే గ్రీన్‌కార్డులకు అదనంగా వీటని కలపనున్నట్టు అధ్యక్షుడి సలహా కమిషన్‌లో సభ్యుడిగా ఉన్న అజయ్ భుటోరియా తెలిపారు.






