పారిస్ ఒప్పందం నుంచి అమెరికా ఔట్?
భూతాపం నుంచి భూగోళాన్ని రక్షించే ఉద్దేశంతో కుదుర్చుకున్న పారిస్ పర్యావరణ ఒప్పందం 2015 నుంచి వైదొలగుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. అయితే, ఈ మేరకు ఉపసంహరణ ప్రక్రియను అమెరికా ప్రారంభించే అవకాశం ఉన్నట్టు స్థానిక మీడియా సంస్థలు ప్రకటించాయి. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి లేఖ రాయాల్సి ఉంది. ఈ ఒప్పందంపై దాదాపు 200 దేశాలు సంతకాలు చేశాయి. అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒరాక్ ఒబామా ఈ ఒప్పందానికీ అంగీకారం తెలిపారు. 2016 నవంబర్ 4 నుంచి ఇది అమలులోకి వచ్చింది. అయితే ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక ఈ ఒప్పందం భారత్, చైనాలకు అనుకూలంగా ఉందని, అమెరికా ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగిస్తుందని ట్రంప్ ఆరోపించారు. ఈ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు.













