వికీలీక్స్ అసాంజేపై అమెరికా ఆరోపణలు
వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ ఆసాంజేపై అమెరికా న్యాయశాఖ సంచలన అభియోగాలు మోపింది. లుల్జ్సెక్ సహా ప్రపంచ వ్యాప్తంగా అనేక సైబర్ దాడుల్లో ప్రమేయం ఉన్న మరికొన్ని గుర్తుతెలియని గ్రూప్లతో కలిసి ఆయన తమ దేశంపై కుట్రపన్నారని ఆరోపించింది. 2012 లో లుల్జ్సెక్ అధినేతకు హ్యాక్ చేయాల్సిన టార్గెట్స్ జాబితాను అసాంజే అందజేశారనీ, అందులోనూ సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ, న్యూయార్క్ టైమ్స్ తదితర సంస్థల నుంచి అత్యంత ప్రభావితం చేసి సమాచారాన్ని లీక్ చేయాలని అతడితో అసాంజే చెప్పినట్టు న్యాయశాఖ ఆరోపించింది. వాస్తవానికి ఆ సమయంలో లుల్జ్సెక్ అధినేత ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్డిఐ)తో కలిసి పనిచేస్తున్నట్టు తెలిపింది.













