దాడులు జరగొచ్చు జాగ్రత్త : అమెరికా
క్రిస్మస్, న్యూ ఇయర్ పండుగలు దగ్గరపడుతున్నాయి. దీంతో చాలా మంది ప్రజలు వేడుకలు చేసుకోవడానికి వివిధ దేశాలకు వెళుతుంటారు. అయితే వేడుకల కోసం యూరప్ వెళ్లే అమెరికన్లు జాగ్రత్తగా ఉండాలని అమెరికా పోలీస్ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. క్రిస్మస్ నాడు యూరప్‌లో దాడులు జరిగే అవకాశం ఉందని అమెరికన్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గతేడాది క్రిస్మస్ పండుగ నాడు జర్మనీలోని బెర్లిన్‌లో దాడులు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. టర్కీలోనూ ఓ నైట్‌క్లబ్‌లో కాల్పులు జరగడంతో 30 మంది మృత్యువాతపడ్డారు. బ్రిటన్, ఫిన్‌ల్యాండ్, రష్యా, స్పెయిన్, స్వీడెన్ దేశాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆల్‌ఖైదా, ఐసిస్ ఉగ్రమూకలు ఈ దేశాలపైనే నిఘా పెట్టినట్లు అమెరికన్ పోలీస్ శాఖ హెచ్చరించింది.













