2 మిలియన్ల వ్యాక్సిన్లు సిద్ధం : ట్రంప్
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మృత్యు ఘంటికలు మోగిస్తోంది. నానాటికీ కేసుల సంఖ్య తీవ్రరూపం దాల్చుతూ మానవ మనుగడను ప్రమాదంలోకి నెట్టివేస్తోంది. ముఖ్యంగా కరోనా ధాటికి అగ్రరాజ్యం అమెరికా విల్లవిల్లాడుతోంది. అమెరికాలో ప్రస్తుతం 1.87 మిలియన్ల కరోనా నమోదయ్యాయి. వైరస్ బారిన పడి ఇప్పటి వరకు 108,120 మంది మరణించారు. దేశంలో కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఇప్పటికే 2 మిలియన్ల కరోనా వ్యాక్సిన్ను తయారు చేసినట్లు ట్రంప్ వెల్లడించారు. వీటికి భద్రతా పరిశోధనలు పూర్తి అయితే ఉపయోగించేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు.













