మరోసారి స్తంభించిన అమెరికా!
క్రిస్మస్ పర్వదిన రోజుల్లో అమెరికా ప్రభుత్వం స్తంభించిపోయింది. ట్రంప్ ప్రతిపాదించిన వ్యయ బిల్లుపై వ్యతిరేకత వ్యక్తం కావడంతో, పాక్షికంగా ప్రభుత్వ ఆఫీసులను మూసివేయాల్సి వచ్చింది. మెక్సికో బోర్డర్ వద్ద గోడను నిర్మించేందుకు వ్యయ బిల్లులో 5 బిలియన్ల డాలర్లు కేటాయించాలని ట్రంప్ ప్రతిపాదించారు. కాఈన ఆ ప్రాతిపాదనకు డెమోక్రాట్లు నుంచి వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. దీంతో వ్యయ బిల్లు కాంగ్రెస్ సభలో ఆగిపోయింది. గత రెండేళ్లలో ఇలా ప్రభుత్వం స్తంభించడం ఇది మూడవసారి కావడం విశేషం. మొత్తం తొమ్మిది ఫెడరల్ శాఖలు తమ పనిని నిలిపివేయనున్నాయి. వీటితో పాటు మరికొన్ని ఏజెన్సీలు కూడా తమ కార్యకలాపాలను ఆపేస్తాయి. దీని వల్ల వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలపై ప్రభావం పడనున్నది. వ్యయ బిల్లు వాయిదా పడడంతో దేశవ్యాప్తంగా హోమ్‌ల్యాండ్ సెక్యూర్టీ, ట్రాన్స్‌పోర్టేషన్, అగ్రికల్చర్, స్టేట్ అండ్ జస్టిస్ డిపార్ట్మెంట్లను మూసివేయనున్నారు. జాతీయ పార్కులు, అడవులను కూడా మూసివేస్తున్నారు.













