ఆ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి : అమెరికా
హాంకాంగ్ కోసం చైనా తీసుకువచ్చిన జాతీయ భద్రతా చట్టాన్ని అమెరికా కాంగ్రెస్ వ్యతిరేకించింది. ఆ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలంటూ ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించింది. తుది ఆమోదం కోసం ఆ బిల్లు వైట్‌హౌస్‌కు చేరింది. హాంకాంగ్‌లో ప్రజాస్వామ్యాన్ని, మానవ హక్కులను అణచివేయాలని భావిస్తున్న చైనాకు అమెరికా మద్దతు ఉండదని ఈ సందర్భంగా సెనేటర్లు వ్యాఖ్యానించారు. కాగా, బయటనుంచి ఎంత ఒత్తిడి వచ్చినప్పటికీ హాంకాంగ్ సుస్థిరత్వ విషయంలోనూ, దేశ సార్వహౌమాధికారాన్ని కాపాడుకోవడంలోను చైనాకున్న సంకల్పం మారదని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావో లిజియన్ ప్రకటించారు. హాంకాంగ్ విషయంలో జోక్యం చేసుకోవద్దని, కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బిల్లును చట్టంగా మార్చవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు విజ్ఞప్తి చేశారు.













