చైనా నెత్తిపై ట్రంప్ మరో పిడుగు!
వాణిజ్య యుద్ధంపై ఓ వైపు చర్చలు జరుపుతూనే అమెరికా మరోసారి చైనాపై సుంకాల మోత మోగించింది. మరో 300 బిలియన్ డాలర్ల చైనా ఉత్పత్తులపై 10 శాతం అదనపు సుంకం విధించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సెప్టెంబర్ 1 నుంచి కొత్త సుంకాలు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ఇప్పటికే 250 బిలియన్ డాలర్ల దిగుమతులపై అమెరికా విధించిన 25 శాతం సుంకానికి ఇది అదనమని ట్రంప్ వెల్లడించారు. వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయి. చర్చలు జరుగుతుండగానే సెప్టెంబర్ 1 నుంచి మిగతా 300 బిలియన్ డాలర్ల చైనా దిగుమతులపై అమెరికా అదనంగా 10 శాతం సుంకం విధించనుంది. ఇప్పటికే 250 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై విధించిన 25 శాతం సుంకానికి దీంతో సంబంధం లేదు అని ట్రంప్ పేర్కొన్నారు.













