చైనా, అమెరికా వాణిజ్య ప్రతినిధుల మధ్య చర్చ
ప్రజా రోగ్యం, వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి చైనా, అమెరికా వాణిజ్య సంబంధాల ప్రతినిధులు ఫోన్లో సంభాషించుకున్నారు. చైనా వైస్ ప్రీమియర్, కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ పొలిట్ బ్యూరో సభ్యులు లియు హే.. అమెరికా వాణిజ్య సంబంధాల ప్రతినిధి రాబర్ట్ లైట్థిజర్, ట్రెజరీ సెక్రటరీ స్టీవెస్ మునుచిన్తో శుక్రవారం ఫోన్లో సంభాషించారు. లియూ చైనా- అమెరికా సమగ్ర ఆర్థిక చర్చలపై ఈ దేశం తరుపున చీఫ్గా వ్యవహరిస్తున్నారు. స్థూల ఆర్థికం, ప్రజారోగ్యాన్ని పెంపొందించుకోవాలని, చైనా, అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పంద అమలు, దాని తగ్గ పరిస్థితులను సృష్టించేందుకు, సానుకూల ఫలితాల కోసం ప్రయత్నాలకు ఇరు దేశాలు అంగీకారం తెలిపాయి. కమ్యూనికేషన్, సహకార నిర్వహణకు కూడా ఆమోదం తెలిపాయి.













