ఆ దేశానికి భారత్ సహకారాన్ని స్వాగతిస్తున్నాం : అమెరికా
అప్ఘనిస్థాన్ ప్రభుత్వానికి భారత్ అందిస్తున్న సహకారిన్ని అమెరికా స్వాగతించింది. అఫ్ఘన్ నుంచి తమ బలగాల్ని ఉపసంహరించుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ దేశానికి భారత్ సాయాన్ని కొనసాగించడాన్ని అమెరికా ప్రశంసించింది. అఫ్ఘాన్‌కు భారత్ అందిస్తోన్న సహకారాన్ని స్వాగతిస్తున్నట్టు ప్రకటించింది. 2001లో తాలిబన్లపై అమెరికా పోరాటానికి దిగిన నాటి నుంచి భారత్ మూడు బిలియన్ డాలర్ల ఆర్థిక సహకారాన్ని అందజేసిందని వెల్లడించారు. అఫ్ఘాన్‌లో భారత్ పాత్ర అనే అంశంపై హడ్సన్ ఇన్స్టిట్యూట్లో జరిగిన సదస్సులో అమెరికాకు చెందిన అఫ్ఘనిస్థాన్ విభాగం ఇన్‌ఛార్జి జాక్సన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో భారత్‌కు అమెరికా మద్దతు ఎప్పటికీ ఉంటుందన్నారు.
దక్షిణాసియాపై అనుసరిస్తూన్న వ్యూహంలో భాగంగా భారత్‌తో ట్రంప్ మెరుగైన సంబంధాలను కోరుకుంటున్నారని అన్నారు. తాలిబన్లతో జరుగుతున్న యుద్ధానికి తెరదించాలని అమెరికన్లు కోరుకుంటున్నారన్నారు. ఈ నేపథ్యంలో సయోధ్య దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న అఫ్గానిస్థాన్ పునర్నిర్మాణంలో భారత్ కీలక పాత్ర పోషిస్తూ వస్తోందన్నారు. ఇప్పటి వరకు వివిధ రంగాల్లో 400 ప్రాజెక్టులను పూర్తిచేసిందన్నారు. మరో 150 నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. అఫ్ఘాన్ సుస్థిర దేశంగా అవతరించడానికి భారత్ సహకారం కొనసాగుతుందన్నారు.













