వాణిజ్య యుద్ధానికి అమెరికా, చైనా తెర
అమెరికా, చైనా తమ మధ్య వాణిజ్య యుద్ధాన్ని తగ్గించేందుకు సిద్ధమయ్యాయి. అందులో భాగంగా అమెరికా నుంచి తమకు అవసరమైన వస్తువులు, సేవల దిగుమతిని పెంచేందుకు చైనా అంగీకరించింది. తద్వారా తమతో అమెరికాకు గల 375 బిలియన్ల డాలర్ల వాణిజ్య లోటును తగ్గించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఈ విషయమై వాషింగ్టన్లో జరిగిన చర్చల తర్వాత ఇరుదేశాలు సంయుక్త ప్రకటన జారీ చేశాయి. ఉత్పాదక వస్తువులు, సేవారంగంలో వాణిజ్యాన్ని విస్తరించాలని నిర్ణయించామని అమెరికా ఆర్థికమంత్రి స్టీవెన్ మ్యూచిన్, చైనా ప్రధాని లియూ హీ తెలిపారు.













