సెంట్రల్ వర్సిటీ విద్యార్థినికి 43లక్షలు ప్యాకేజీతో ఉద్యోగం
హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ విద్యార్థిని నందినిసోని ఆడోబ్ సిస్టమ్స్ సంస్థలో ఏడాదికి రూ.43 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం దక్కించుకుంది. మహారాష్ట్రకు చెందిన నందినిసోని సెంట్రల్ వర్సిటీలో ఎంసీఏ స్కూల్ ఆఫ్ కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్లో చదువుతోంది. వర్సిటీ చరిత్రలో ఇప్పటి వరకు అత్యధిక ప్యాకేజీ అందుకున్న విద్యార్థిగా నందిని సోని నిలిచింది. నైపుణ్యం కలిగిన సాఫ్ట్వేర్ డెవపర్గా ఎదగడానికి కాలేజీలో విద్యార్థుతో చేసిన ఎన్నో ప్రాజెక్టు ఉపయోగపడ్డాయని ఆమె చెప్పింది. ఈ ప్లేస్మెంట్ ప్రక్రియలో విద్యార్థినులకు ఆడోబ్ సిస్టమ్స్ అధిక ప్రాముఖ్యత ఇచ్చినట్లు ఏజీఏబీ చైర్మన్ ప్రొఫెసర్ రాజీవ్ వాంకర్ తెలిపారు. ఈ ఏడాది వర్సిటీలో నిర్వహించిన క్యాంపస్ ప్లేస్మెంట్ల్లో 200 మందికి పైగా విద్యార్థులు ఉద్యోగాలు పొందినట్లు తెలిపారు.













