అరిజోనా వర్సిటీతో అమృత ఒప్పందం
విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలను అందించేందుకు అమృత విశ్వ విద్యాపీఠం..యూనివర్సిటీ ఆఫ్ అరిజోనాతో ఒప్పందం చేసుకుంది. అమృత విశ్వ విద్యాపీఠం ఛాన్స్లర్ మాతా అమృతానందమయి, యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా విద్యా వ్యవహారాల వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ లీస్ల్ ఫోక్స్ ఇద్దరూ లెటర్ ఆఫ్ ఇంటెంట్పై సంతకాలు చేశారు. డిగ్రీ, పీజీ స్థాయిల్లో ఇంటిగ్రేటెడ్, డ్యూయల్ డిగ్రీలు అందించేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుంది. ప్రధానంగా ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, నానోటెక్నాలజీ, సోషల్ సైన్సెస్, వైద్యవిద్య, ప్రజారోగ్యం, వ్యవసాయ విద్యలలో ఇవి ఉంటాయి. ఈ ఒప్పందం వల్ల ఇరుసంస్థల విద్యార్థులు విదేశీవిద్య అభ్యసించే అవకాశం కలుగుతుంది.













