భారత సంతతి ప్రముఖులకు అరుదైన పురస్కారాలు!
సరికొత్త ఆవిష్కరణలతో తమదైన ముద్రవేసిన ఇద్దరు భారత సంతతి నిపుణులకు ఈ ఏడాదికి అత్యంత ప్రతిష్ఠాత్మక నేషనల్ ఇన్వెంటర్స్ హాల్ ఆఫ్ ఫేమ్ గౌరవం లభించింది. అద్భుత ఆవిష్కర్తలను గుర్తించి గౌరవించే స్వచ్ఛంద సంస్థ అయిన నేషనల్ ఇన్వెంటర్స్ హాల్ ఆఫ్ ఫేమ్ 2018వ సంవత్సరానికి గాను భారత సంతతికి చెందిన ఆరోగ్యస్వామి పాల్‌రాజ్, సుమిత్రా మిత్రాలను ఈ పురస్కారానికి ఎంపిక చేసుకుంది. బ్రాడ్‌బాండ్ వైర్లెస్ అంతర్జాలం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి అందుబాటులోకి తెచ్చే తరహా వైర్లెస్ టెక్నాలజీని ఆరోగ్య స్వామి పాల్‌రాజ్ కనుగొన్నారు. దంత చికిత్సలో వినియోగించే సరికొత్త పదార్థం ఫిల్టెక్ సుప్రీం రెస్టోరేటివ్ను కనుగొన్న సుమిత్రా మిత్రా (69)కు కూడా ఈ అపూర్వ గౌరవం లభించింది.













