130 మంది ప్రముఖుల ట్విటర్ ఖాతాలు హ్యాక్
గత వారం రోజుల్లో 130 మంది ప్రముఖుల ట్విటర్ ఖాతాలు హ్యాక్ అయ్యాయి. ఈ విషయాన్ని ట్విటరే తెలిపింది. తొలుత ట్విటర్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని వారి ద్వారా సంస్థ అంతర్గత వ్యవస్థలోకి హ్యాకర్లు చొరబడ్డారని భావించారు. ఇందుకు ప్రతిస్పందనగా గత 30 రోజుల్లో పాస్వర్డ్ మార్చేందుకు ప్రయత్నించిన ఖాతాలన్నింటినీ గుర్తించి ట్విటర్ బ్లాక్ చేస్తోంది. అయితే హ్యాకర్లు మాత్రం ఇలా పాస్వర్డ్లు మార్చినట్టు ఎలాంటి ఆధారాలు లేవు. తొలుత బుధవారం క్రిప్టో కరెన్సీ స్కామర్లు అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా, ప్రస్తుత అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న జో బైడెన్, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ సహా పలువురు ప్రముఖుల ఖాతాలను హ్యాక్ చేశారు. ఈ విషయం గుర్తించిన వెంటనే ఆయా ఖాతాల యజమానులతో కలిసి పనిచేస్తున్నామని, హ్యాకింగ్ ఎలా జరిగిందో దర్యాప్తు చేస్తున్నామని ట్విటర్ పేర్కొంది.













