ఆస్ట్రేలియా పర్యటనలో ప్రముఖులను కలుసుకున్న వైవీ సుబ్బారెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా పలువురు ప్రముఖులను కలుసుకుంటున్నారు. ఆసీస్ డిప్యూటీ హైకమిషనర్‌తో, భారత డిప్యూటీ హై కమిషనర్లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ఆస్ట్రేలియా పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. తర్వాత సిడ్నీలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో సుబ్బారెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు ఇచ్చి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఆ దేశ పార్లమెంట్ భవనాన్ని కూడా సుబ్బారెడ్డి దంపతులు సందర్శించారు.













