ట్రంప్ కు తేలియదు…ఆ తేడా నేనే చెప్పా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. గతంలో తాను c, హెచ్‌పీవీ(హ్యూమన్ ప్యాపిలోమా వైరల్ ఇన్ఫెక్షన్)కి తేడా చెప్పమని తనని అడిగినట్లు గేట్స్ అన్నారు. గతంలో గేట్స్ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమానికి బిల్‌గేట్స్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ట్రంప్ గురించి ప్రస్తావించారు. నేను ట్రంప్‌తో రెండు సార్లు సమావేశమయ్యాను. ఒకసారి అధ్యక్ష ఎన్నికల సమయంలో, మరోసారి వైట్‌హౌస్‌లో కలిశాను. ఆ రెండు సమావేశాల్లో ట్రంప్ నన్ను హెచ్ఐవీకి, హెచ్‌పీవీకి తేడా చెప్పమని అడిగారు. ఆయన అంతగా అడుగుతుండడంతో ఆ పదాలతో అందరూ కన్ప్యూజ్ అవుతున్నారని ఆ రెండూ వేరు వేరు వైరస్లని చెప్పాను. అంతేకాదు వ్యాక్సిన్ల వల్ల ఏమన్నా చెడు ప్రభావాలు ఉంటాయా? అని కూడా ట్రంప్ అడిగారు. ఒకవేళ వ్యాక్సిన్ల వల్ల చెడు ప్రభావాలు ఉంటే వాటిని నిషేధిస్తానని అన్నారు. అలా చేయడం ప్రమాదమని చెప్పాను. ఆయనకు సైన్స్ సలహాదారుగా నన్ను వ్యవహరించాల్సిందిగా కోరారు. కానీ ఆ పోస్టుకు న్యాయం చేయగలనన్న నమ్మకం నాకు లేదని చెప్పాను అని వెల్లడించారు బిల్‌గేట్స్.













