హెచ్-1బీ జీవిత భాగస్వాములకు ఇబ్బందులే
హెచ్-1బీ వీసాల జారీ కఠినతరం చేసేందుకు ఇప్పటికే అమెరికా పలు ఆంక్షలను విధిస్తూ వచ్చింది. దీనికి సంబంధించి ఇటీవలే అమెరికా కాంగ్రెస్ చట్ట సభలో బిల్లును ప్రవేశపెట్టగా, అందుకు ఆమోద ముద్ర కూడా పడింది. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం మరో కొత్త నిర్ణయం తీసుకోబోతుంది. హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగాలు చేయకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోనుంది. ఈ విషయాన్ని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) అధికారికంగా వెల్లడించింది. ట్రంప్ ప్రభుత్వం అవలంభిస్తున్న బై అమెరికన్, హైర్ అమెరికన్ పాలసీ విధానంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నిబంధన తీసుకురావడానికి గల కారణాలను డీహెచ్ఎస్ వెల్లడించలేదు.













