తప్పు చేశావ్ క్షమాపణ చెప్పు : ట్రంప్
తనపై అసత్య ప్రచారాన్ని చేసినందుకు గాను ఓ విలేకరిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. క్షమాపణలు చెప్పాల్సిందిగా డిమాండ్ చేయడంతోపాటు అతన్ని ఉద్యోగం నుంచి తొలగించాలని కోరారు. ఇంతకూ ఏం జరిగిందంటే వాషింగ్టన్ పోస్ట్‌కు చెందిన రిపోర్టర్ డేవ్ వెజెల్ డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న ఓ సభలో ప్రజలెవరూ పాల్గొనలేదని పేర్కొంటూ, సభ ఖాళీగా ఉన్న కొన్ని ఫొటోలను తన ట్వీటర్లో పోస్ట్ చేశారు. వీటిని చూసిన ట్రంప్ తాను సభకు హాజరవ్వక ముందు తీసిన ఫోటోలను వెజెల్ పోస్ట్ చేశాడని, తనపై అసత్య ప్రచారం చేసినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన వెజెల్ ట్రంప్‌కు క్షమాపణలు చెప్పడంతో పాటు ఆ ఫొటోలను సైతం తొలగించారు. అయినా శాంతించని ట్రంప్ అతన్ని ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తప్పుడు వార్తలు ప్రచారం చేశారంట సీఎన్ఎన్ చానల్‌పై ట్రంప్ మండిపడ్డారు.













