కరోనా కష్టాలకు ట్రంప్ చెక్
కరోనా వైరస్ కారణంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రజల కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సత్వర ఆర్థిక సాయం ప్యాకేజీని ప్రవేశపెట్టబోతున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్క అమెరికన్ పౌరుడికి వెయ్యి డాలర్లకు పైగా నగదు అందుతుందని అమెరికా ఆర్థిక మంత్రి సీవ్టెన్ మున్చిన్ వెల్లడించారు. ఈ ప్రతిపాదన సెనెట్ ఆమోదం పొందితే రెండు వారాల్లోనే ఈ పథకం కార్యరూపం దాల్చే అవకాశాలున్నాయన్నారు. కరోనా కారణంగా ఆర్థిక సంక్షోభవం తలెత్తిన నేపథ్యంలో అమెరికన్లకు ఇప్పుడు డబ్బు అవసరం ఉందని, ట్రంప్ ఆ అవసరాన్ని తీర్చాలనుకుంటున్నారని స్టీవెన్ అన్నారు. నెలకు వెయ్యి అమెరికన్ డాలర్ల చొప్పున ఇవ్వాలనుకుంటున్నట్టు వెల్లడించారు.
ఉద్దీపనం మాదిరిగా దీన్నొక కనీసాదాయంగా అందివ్వాలన్నది ట్రంప్ ఉద్దేశంగా ఉంది.
అమెరికాలో నిరుద్యోగం రోజురోజుకి తీవ్రమవుతున్నది. ఓహియోలో కిందటివారం 6500 మంది నిరుద్యోగులుగా నమోదు అయితే, ఈవారం ఆ సంఖ్య 45,000 లకు చేరింది. ఇంకొందరికి ఆదాయంలో కోత పడింది. అందువల్ల అమెరికన్లను ఆదుకోవాలన్నది ట్రంప్ ప్రభుత్వ ఉద్దేశంగా చెబుతున్నారు. అంతేకాదు, పన్నుల చెల్లింపుల్ని కూడా మూడు నెలలపాటు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.













