10 రోజుల్లో ఆ దేశాన్ని తుడిచిపెట్టేయగలను : ట్రంప్
కశ్మీర్‌పై వ్యాఖ్యలతో కలకలం సృష్టించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తల్చుకుంటే అప్గాన్ యుద్ధంలో సులభంగా గెలవగలనని.. అయితే, కోటిమందిని చంపాలని తాను కోరుకోవడం లేదని పేర్కొన్నారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో భేటీ అయిన ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అఫ్గాన్ సంక్షోభానికి త్వరగా తెరదించగల ప్రణాళికలు తన వద్ద ఉన్నాయని ట్రంప్ అన్నారు. కానీ అవి కేవలం 10 రోజుల్లో భూమిపై నుంచి ఆ దేశాన్ని పూర్తిగా తుడిచి పెట్టేస్తాయని వ్యాఖ్యానించారు. అందుకే ఆ మార్గాన్ని ఎంచుకోవడం లేదని తెలిపారు.













