కిమ్ తిరిగి రావడం సంతోషకరం : ట్రంప్
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంగా తిరిగి ప్రజలకు కనిపించడం చాలా ఆనందంగా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. దాదాపు మూడు వారాల పాటు కిమ్ ఎవరికీ కనిపించక పోవడంపై ఆయన తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని వదంతులు వ్యాపించాయి. ఉత్తరకొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ సమీపాన సన్చొన్ వద్ద కిమ్ ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించారు. ఈ మేరకు ఆ వీడియోలన్నిటినీ అక్కడి అధికారిక వీడియో కెసిఎన్ఎ విడుదల చేసింది. ఆయన నడుస్తూ చిరునవ్వు చిందించడం, సిగరెట్టు కాలుస్తూ ఉండడం ఈ దృశ్యాలన్నీ ప్రసారం అయ్యాయి.













