అధ్యక్షుడు షేర్ చేసినా తొలగిస్తాం : ఫేస్బుక్
తమ ప్రమాణాలకు అనుగుణంగా లేని విద్వేషపూరిత, అసత్య సమాచారాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షేర్ చేసినా తొలగిస్తామని ఫేస్బుక్ సిఒఒ షెరిల్ శాండ్బర్గ్ తెలిపారు. నవంబరులో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ప్రసంగాలను ఏవిధంగా పర్యవేక్షిస్తారనే ప్రశ్నకు ఆమె పై విధంగా స్పందించారు. గతంలో నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ మృతిపై జరిగిన ఆందోళనకు సంబంధించి ట్రంప్ చేసిన పరుష వ్యాఖ్యలను ఫేస్బుక్ తొలగించలేదు. మనదేశంలో బీజేపీ నేతలు చేసిన పలు వివాదాస్పద, విద్వేష ట్విట్లను తీసేయలేదు. దీంతో, అమెరికాతో పాటు మనదేశంలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఫేస్బుక్ తాజా ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.













